తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హీరో .. హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. ఆమెతో అందమైన జీవితాన్ని ఊహించుకుంటాడు. అయితే అదే సమయంలో ఆయనకి కొందరు వ్యక్తులు తారసపడతారు. అప్పటి నుంచి ఆయన మూడ్ మారిపోతుంది. అందుకు కారణం ఏమిటి? ఆయన గతంలో వాళ్ల పాత్ర ఏమిటి? అనేదే కథ.
ఈ ట్రైలర్ చూస్తే .. ఈ సినిమాకి ‘నాట్ ఏ లవ్ స్టోరీ అనే టైటిల్ ను ఎందుకు సెట్ చేశారనేది తెలుస్తుంది. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉండి, సినిమాపై అంచనాలు పెంచుతోంది. దర్శకుడు రాజు కొత్త కాన్సెప్టును ఎంచుకున్నాడనే అనిపిస్తోంది. ఈ సినిమాతో టాలీవుడ్లో నిలదొక్కుకోవాలనే ప్రియా ప్రకాశ్ కోరిక నెరవేరుతుందేమో చూడాలి.