తాజాగా ఈ అమ్మాయి నుంచి మరో సినిమా వస్తోంది .. దాని పేరే ‘ఇష్క్’ .. ‘నాట్ ఎ లవ్ స్టోరీ’ అనేది ట్యాగ్ లైన్. ఎన్వీ ప్రసాద్ .. పారస్ జైన్ .. వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, ఎస్.ఎస్.రాజు దర్శకత్వం వహించాడు. ‘జాంబి రెడ్డి’ సినిమాతో పాప్యులర్ అయిన తేజ సజ్జ ఈ సినిమాలో కథానాయకుడిగా నటించాడు. ఆయన జోడీగా ప్రియా ప్రకాశ్ అలరించనుంది.
ఉగాది సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ .. ఒక స్పెషల్ పోస్టర్ ను వదిలారు. ఈ నెల 23వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇది లవ్ స్టోరీ కాదంటూ దర్శకుడు ఏం చెప్పదలచుకున్నాడో చూడాలి మరి.