ప్రముఖ సినీ హాస్యనటుడు వివేక్ మరణంతో తమిళ చిత్ర పరిశ్రమ ఆవేదనలో మునిగిపోయింది. 59 ఏళ్ల వివేక్ కార్డియాక్ అరెస్ట్ కు గురై మృతి చెందారు. ఆయన మరణంపై సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందిస్తూ… తన ఆప్త మిత్రుడు వివేక్ మరణం తనను కలచివేసిందని చెప్పారు. ఎంతో బాధ కలుగుతోందని అన్నారు. ‘శివాజీ’ సినిమా షూటింగ్ సమయంలో ప్రతి రోజు ఆయనతో సమయాన్ని గడిపానని.. తన జీవితంలో ఆ రోజులను మర్చిపోలేనని చెప్పారు. వివేక్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని అన్నారు. వివేక్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
#RipVivek pic.twitter.com/MSYVv9smsY
— Rajinikanth (@rajinikanth) April 17, 2021
Ahhh.. #vivek …gone too soon dear friend ..thank you for planting thoughts n trees …thank you for entertaining and empowering us with your wit and humour..will miss you…RIP pic.twitter.com/oyoOkx8G9q
— Prakash Raj (@prakashraaj) April 17, 2021