సూపర్ స్టార్ రజనీకాంత్‌కి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమా కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటారు. కాగా ఆయన అభిమానులకు వినాయక చవితి పండగ బోనస్ ఇచ్చింది. రజనీ కొత్త చిత్రం ‘అన్నాత్తె’ ఫస్ట్ లుక్‌ని చిత్ర బృందం పండుగ సందర్భంగా శుక్రవారం (సెప్టెంబర్ 10న) విడుదల చేసింది. పంచకట్టులో కళ్లదాలు పెట్టుకొని స్టైలిష్‌గా నిలుచున్న తలైవా లుక్ అభిమానులను కట్టిపడేస్తోంది.
సన్ పిక్చర్స్ పతాకంపై రూపొందనున్న ఈ మూవీకి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో నయనతార, కీర్తిసురేశ్, మీనా, ఖుష్బూ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల సూపర్‌స్టార్ నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కావడం లేదు. ఈ తరుణంలో వస్తున్న ‘అన్నాత్తె’పైనే అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.
#AnnaattheFirstLook #Annaatthe#அண்ணாத்த@rajinikanth @directorsiva @sunpictures #Nayanthara @KeerthyOfficial @immancomposer @khushsundar @Actressmeena16 @sooriofficial @AntonyLRuben @dhilipaction @RIAZtheboss#AnnaattheDeepavali pic.twitter.com/47d0aJBYqa
— vetri (@vetrivisuals) September 10, 2021