బాలీవుడ్ నటి సన్నీ లియోనీ నటిస్తున్న కొత్త చిత్రం ‘షిరో’. సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంగా రూపొందుతున్న ఈ సినిమాకి శ్రీజిత్ విజయన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇకిగాయ్ మోషన్ పిక్చర్స్ పతాకంపై నిర్మితమౌతోన్న చిత్రానికి సంబంధించి తాజాగా మోషన్ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. సినిమా గురించి సన్నీ ట్వీటర్ వేదికగా స్పందిస్తూ..‘‘సైకాలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘షిరో’లో నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది’’ అంటూ వెల్లడించింది.
సినిమాని తెలుగు, తమిళం, మలయాళంతో పాటు హిందీలోనూ విడుదల చేయనున్నారు. సన్నీ తెలుగులో ‘కరెంటు తీగ’ చిత్రంలో అతిథి పాత్రలోనూ, రాజశేఖర్ నటించిన ‘గరుడవేగ’ చిత్రంలో ‘‘డియో డియో’’ ప్రత్యేక పాటతో ప్రేక్షకులని మెప్పించింది. ప్రస్తుతం హిందీలో ‘ది బ్యాటిల్ ఆఫ్ భీమాగావ్’ చిత్రంలో ఓ ఐటెమ్ సాంగ్లో నటిస్తోంది.
So excited to be part of #SHERO a psychological thriller!! 😍
Presented by @IkigaiMotion
Produced by @AnsariNextel
Project Head :@swarajnb
Directed By Sreejith VijayanFilm will be released in Tamil, hindi, telugu, malayalam. pic.twitter.com/joMlOH7ZRt
— sunnyleone (@SunnyLeone) March 25, 2021