‘మహానటి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింతగా చేరువయ్యారు యువ హీరో దుల్కర్ సల్మాన్. ఆయన ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో త్రిభాషా చిత్రం చేస్తున్నారు. లెఫ్టినెంట్ రామ్‌గా దుల్కర్ కనిపించనున్నారు. ఇందులో సీనియర్ కథానాయకుడు సుమంత్ ఓ ముఖ్య పాత్రని పోషిస్తున్నట్టు తెలిసింది. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ సెట్‌ని తీర్చిదిద్దారు. అందులో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు.