కిరణ్ అబ్బవరం – ప్రియాంక జవాల్కర్ జంటగా రూపొందిన ‘ఎస్ ఆర్ కల్యాణ మండపం’ సినిమా, ఈ నెల 6వ తేదీన థియేటర్లకు వచ్చింది. శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, సాయికుమార్ కీలకమైన పాత్రను పోషించారు. నిర్మాతలు ప్రమోద్ – రాజు ఈ సినిమా ప్రమోషన్స్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు.
ఆ వారంలో విడుదలైన సినిమాల్లో ఇదే ఎక్కువ వసూళ్లను రాబట్టింది. అయితే అదే ఊపును మరికొన్ని రోజుల పాటు కొనసాగిస్తుందనే దర్శక నిర్మాతల అంచనాలు తప్పాయి. కొద్దిపాటి లాభాలతో సినిమా ఓకే అనిపించుకుందట. ఆ సినిమాను ఇప్పుడు ఓటీటీ ద్వారా వదలడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ సినిమా ఓటీటీ హక్కులు ‘ఆహా’ వారు తీసుకున్నారట. సాధ్యమైనంత త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నారని అంటున్నారు. ‘ఆహా’ నుంచి స్ట్రీమింగ్ డేట్ రానున్నట్టుగా చెబుతున్నారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన ఈ సినిమా ‘ఆహా’ ద్వారా ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందో చూడాలి.
తెలుగు సినిమా అభిమానులందరికీ ముఖ్య గమనిక! మిమ్మల్ని థియేటర్లలో అలరించిన సూపర్ హిట్ చిత్రం SR కళ్యాణ మండపం అతి త్వరలో మీ ఆహా లో విడుదల అవబోతుంది. సిద్ధంగా ఉండండి!#SRKalyanamandapamOnAHA@Kiran_Abbavaram@ItsJawalkar @sridhar_chotu @chaitanmusic @ee_movies @LahariMusic pic.twitter.com/G1GlK9jycJ
— ahavideoIN (@ahavideoIN) August 17, 2021