ఒకేసారి తమిళ .. తెలుగు భాషల్లో విడుదలవుతున్న విజయ్ సేతుపతి ఫస్టుమూవీ ఇదేనని అంటున్నారు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాలో, జగపతిబాబు .. సాయిధన్సిక కీలకమైన పాత్రలను పోషించారు. ఇతర ముఖ్యమైన పాత్రల్లో కలైయరసన్ .. రమేశ్ తిలక్ కనిపించనున్నారు.
ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే మళ్లీ తమిళనాట తన జోరును కొనసాగించాలనే ఉద్దేశంతో శ్రుతి హాసన్ ఉంది. ‘మాస్టర్’ అనువాదం ద్వారా .. ‘ఉప్పెన’ సినిమా ద్వారా తెలుగులో క్రేజ్ పెంచుకున్న విజయ్ సేతుపతికి హిట్ పడుతుందేమో చూడాలి.
#Laabam Grand Release On September 9th in Theaters Near You 🔥#SPJhananathan @immancomposer @KalaiActor @vsp_productions @thilak_ramesh @7CsPvtPte @Aaru_Dir @yogeshdir @LahariMusic @proyuvraaj @sathishoffl pic.twitter.com/EraapMmpd1
— VijaySethupathi (@VijaySethuOffl) August 25, 2021