ఓ స్టార్ హీరో మరో స్టార్ హీరో చిత్రంలో నటిస్తే ఆ సినిమాకు కొత్త క్రేజ్ వస్తుంది. ఇలాంటి ప్రయోగాలు కొత్త కాకపోయినా కొన్ని కలయికలు ఆసక్తిని పెంచుతాయి. ప్రముఖ తమిళ నటుడు విజయ్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బీస్ట్’. పూర్తిస్థాయి యాక్షన్ హంగామా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలై అలరించింది.
ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర వార్త కోలీవుడ్‌లో సందడి చేస్తోంది. ఈ చిత్రంలో అతిథి పాత్రలో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారుక్‌ఖాన్ నటించనున్నట్లు సమాచారం. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో తొలిసారి కోలీవుడ్‌లో అడుగుపెట్టబోతుంది పూజా హెగ్డే. ప్రస్తుతం షారుక్ ‘పఠాన్’ చిత్రీకరణతో బిజీ ఉన్నారు.