‘వాంటెడ్’, ‘దబాంగ్ 3’ సినిమాల తర్వాత సల్మాన్ ఖాన్, ప్రభుదేవా కాంబినేషన్లో వస్తున్న ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్.. ‘రాధే’ (యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్).. జీ స్టూడియోస్ సమర్పణలో సల్మాన్ ఖాన్ ఫిలింస్, సోహైల్ ఖాన్ ప్రొడక్షన్, రీల్ లైఫ్ ప్రొడక్షన్ ప్రై.లి. సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.
దిశా పటానీ హీరోయిన్ కాగా జాకీ ష్రాఫ్, రణ్‌దీప్ హుడా, మేఘా ఆకాష్ కీలకపాత్రల్లో నటించారు. సాజిద్-వాజిద్, రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్, హిమేష్ రేష్మియా మ్యూజిక్ కంపోజ్ చేశారు. గతేడాది ఈద్‌కి విడుదల చెయ్యాలనుకున్నారు కానీ లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ సంవత్సరం ఈద్‌కి గిఫ్ట్ రెడీ చేశాడు సల్మాన్.. రీసెంట్గా ‘రాధే’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మే 13న సల్లూ భాయ్ కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Eid ka commitment tha, Eid par hi aayenge kyun ki ek baar jo maine…….#RadheOn13thMay #2MonthsToRadhe@bindasbhidu @DishPatani @RandeepHooda @PDdancing @SKFilmsOfficial @ZeeStudios_ @SohailKhan @atulreellife @ReelLifeProdn @ZeeMusicCompany pic.twitter.com/mvBxUJPSFp
— Salman Khan (@BeingSalmanKhan) March 13, 2021
హిందీలో వరుస ఫ్లాపుల్లో ఉన్న సల్మాన్ ఖాన్‌కు ప్రభుదేవా ‘వాంటెడ్’ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చాడు. (తెలుగు ‘పోకిరి’ రీమేక్).. ఈ మూవీ తర్వాత సల్మాన్ వెనుదిరిగి చూసుకోలేదు. దాదాపు 10 ఏళ్ళ తర్వాత సల్మాన్ మరోసారి ప్రభుదేవా దర్శకత్వంలో ‘దబాంగ్ 3’, ఆ తర్వాత వెంటనే ‘రాధే’ సినిమా చెయ్యడం విశేషం.