`సారంగ దరియా` సాంగ్ సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇది రికార్డ్ వ్యూస్‌ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో 150 మిలియన్ల వ్యూస్, 1.2 మిలియన్ల లైకులను సొంతం చేసుకొని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అతి తక్కువ సమయంలోనే తమ సినిమా పాటకు 150 మిలియన్ల వ్యూస్ రావడం పట్ల ‘లవ్‌స్టోరీ’ యూనిట్ హర్షం వ్యక్తం చేస్తుంది.
మంగ్లీ ఆలపించిన ఈ గీతం. సాయి పల్లవి స్టెప్పులకు తెలుగు ప్రజలు ఫిదా అయ్యారు. తెలంగాణ జానపదం కావడం, సుద్దాల అశోక్ తేజ లిరిక్స్‌కి, పవన్ అద్భుత సంగీతం తోడవ్వడంతో ఈ పాట అతి తక్కువ సమయంలోనే లక్షలాది మందిని ఆకర్షించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలోదర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ప్రేమ కావ్యం ‘లవ్ స్టోరి’. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రలు పోషించారు. పవన్ సీహెచ్ సంగీతం అందించారు. కె. నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించారు.