అంతరిక్షం కాన్సెప్ట్ తో మనకు ఇప్పటికే చాలా కథలు వచ్చాయి. హాలీవుడ్ లోనే కాకుండా మన తెలుగులోనే దర్శకుడు సంకల్ప్ రెడ్డి అంతరిక్షం అనే చిత్రాన్ని రూపొందించాడు. అలాగే తమిళ్ లో టిక్ టిక్ టిక్ చిత్రం కూడా రూపొందిన విషయం తెల్సిందే.
సాధారణంగా అంతరిక్షం కాన్సెప్ట్ తో రూపొందించిన చిత్రాలను స్టూడియోలలో గ్రీన్ మ్యాట్ పద్దతిలో షూట్ చేసి తర్వాత విఎఫ్ఎక్స్ ను జతచేస్తారు. అయితే తొలిసారి డైరెక్ట్ గా అంతరిక్షంలోనే ఒక రష్యన్ సినిమా రూపొందనుంది. రష్యా అంతరిక్ష సంస్థ తెలిపిన వివరాల ప్రకారం నటి, దర్శకుడిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఈ ఏడాదే పంపనున్నారు.
ఈ చిత్రానికి ఛాలెంజ్ అనే వర్కింగ్ టైటిల్ ను ఫిక్స్ చేసారు. రష్యన్ నటి యూలియా పేరెసిల్డ్ తో పాటు నటుడు, దర్శకుడు క్లిమ్ పేషేంకో నటించనున్నారు. అమెరికా ఆధిపత్యం తగ్గించడానికి రష్యా వారికంటే ముందే అంతరిక్షంలో సినిమా తీయాలని నిర్ణయించుకుంది.