ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను వదిలారు. ‘దిగు దిగు దిగు నాగ’ అంటూ ఈ పాట సాగుతోంది. తెలంగాణలో ‘దిగు దిగు దిగు నాగ’ అనేది చాలా పాప్యులర్ అయిన జానపద గీతం. ఈ పాటను ఆ లైన్ తో మొదలుపెట్టి, అదే బాణీలో సినిమా సాహిత్యాన్ని అల్లారు. తమన్ స్వరపరిచిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా, శ్రేయ ఘోషల్ ఆలపించారు.
మనసైన వాడి కోసం ఎదురుచూస్తూ ఓ కుర్రమనసు కోరికతో పాడే కొంటె పాట ఇది. బీట్ చాలా హుషారుగా .. ఉత్సాహంగా సాగింది. ‘కొంపాకొచ్చిపోరో కోడెనాగ .. కొంపా ముంచుతాందోయ్ ఈడు బాగా’ వంటి పదప్రయోగాలు బాగున్నాయి. ఫొటోగ్రఫీ .. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఆకట్టుకునేలా ఉన్నాయి. మాస్ ఆడియన్స్ నుంచి ఈ పాటకు మంచి మార్కులు దక్కుతాయనడంలో సందేహం లేదు.