ఎ.ఎం. రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఇప్పటికే భారీ సెట్లను నిర్మించారు. ఇందుకోసం పెద్దమొత్తంలో ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమాలో వజ్రాల దొంగ పాత్రలో పవన్ కనిపించనున్నాడు. ఇప్పటికే కొంతవరకు చిత్రీకరణ జరిపారు. త్వరలోనే మరో షెడ్యూల్ షూటింగును మొదలెట్టనున్నారు.
నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను, వచ్చే వేసవిలో విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితం చెప్పారు. పవన్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ రోజున రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఏప్రిల్ 29వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ఒక పోస్టర్ ను వదిలారు. కీరవాణి సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.
Someone who always thinks about d society n serves habitually in any event with such pride n conviction like u do deserve d world n more @pawankalyan sir.
You are, and always will be, a true hero n it’s an honour to be wishing you well on your birthday 💐💐#HariHaraVeeraMallu pic.twitter.com/O5Gqk35v61
— Krish Jagarlamudi (@DirKrish) September 2, 2021