ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన రవితేజ తనదైన శైలి స్టైల్స్‌తో పాటు అదిరిపోయే యాక్టింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు . ముఖ్యంగా బీ, సీ సెంటర్లలో కొన్ని కోట్ల మంది అభిమానాన్ని అందుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘క్రాక్’తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ చిత్రంతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే మాస్ మహారాజ రవితేజ మరిన్ని ప్రాజెక్టులను లైన్లో పెట్టుకుంటున్నాడు.
‘క్రాక్’ విజయంతో ఉత్సాహంగా ఉన్న మాస్ మహారాజా.. ఆ వెంటనే రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ అనే సినిమా స్టార్ట్ చేశాడు. సస్పెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్ చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, త్వరలో రిలీజ్ డేట్ ప్రకటన చేయనున్నారు. ప్రస్తుతం శరత్ మందవా అనే దర్శకుడితో ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే చిత్రాన్ని మొదలెట్టాడు. ఇది కూడా చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది.