మాస్ మహరాజా రవితేజ జయపజయాలతో సంబంధం లేకుండా సినిమా చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘క్రాక్’ మూవీ సూపర్ డూపర్ హిట్ కొట్టిన రవితేజ ఆ వెంటనే రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ అనే సినిమా స్టార్ట్ చేశాడు. సస్పెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్ చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెన్ స్టూడియోస్ సమర్పణలో హవీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
శరత్ మందవా అనే దర్శకుడితో ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే చిత్రాం కూడా చేస్తున్నాడు రవితేజ. ఇది కూడా చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఇక ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ హీరోగా సినిమా రాబోతుందని కొన్ని రోజులుగా వార్తలు ఈ రోజు అఫీషియల్‌గా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పలకరించారు. ధమాకా అనే టైటిల్‌తో మూవీ రూపొందుతుండగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సినిమాలో 20 ఏళ్ల కన్నడ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తుందట. ఇందుకోసం ఆమెకు ఏకంగా రూ. 70 లక్షలు రెమ్యూనరేషన్ ఇస్తున్నారని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Celebrate this #Dussehra with the Double IMPACT!🔥🤩
Here's, the First Look Poster of Mass Maharaja @RaviTeja_offl & @TrinadharaoNak1's #𝐑𝐓𝟔𝟗
FUN FEAST Soon!@vishwaprasadtg @AbhishekOfficl @vivekkuchibotla @KumarBezwada @peoplemediafcy @MayankOfficl pic.twitter.com/BYqQTGVnFu
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) October 15, 2021