పొద్దున్నే చద్దన్నం కేరేజీ సైకిల్ కి తగిలించుకుని పొలానికి వెళ్లి బురదలో దిగి దుక్కి దున్నే రైతన్న కష్టం ఎలాంటిదో తెలిసిందే. ఆ కాయకష్టం ఎలా ఉంటుందో ఇప్పుడు రష్మిక మందన్నకు ప్రాక్టికల్ గా తెలిసొస్తోంది. ఇదిగో ఇలా నేరుగా దుక్కి దున్నేందుకు దమ్ము పట్టిన బురదలోకి దిగింది. జారే పవిటను ముడి వేసి ట్రాక్టర్ తో దుక్కి దున్నుతూ కనిపించింది. మోకాల్లోతుకు కూరుకుపోతున్నాయి కాళ్లు. అయినా దానిని కూడా లెక్క చేయక ఎంతగా శ్రమిస్తోందో చూశారు కదా!
ఆరుగాలం శ్రమించే రైతన్న కష్టం ఏపాటిదో ఈపాటికే ఈ సిన్నమ్మకు అర్థమైపోయింది కాబట్టి.. అందుకు తగ్గట్టే తన పాత్రలోకి పరకాయం చేయడం పెద్ద కష్టమేమీ కాదని అర్థమవుతోంది.
రష్మిక తన తొలి తమిళ చిత్రం `సుల్తాన్` కోసం ఇలా సెట్లో కుస్తీలు పడుతోంది. రష్మిక ఈ తరహా ఛాలెంజింగ్ పాత్రను పూర్తిగా ఆస్వాధిస్తున్నానని తెలిపింది. ఇలా యంత్రంతో దుక్కి దున్నడంలో ఏం ఉంది కానీ మజా.. ఒకప్పుడు కాడెద్దులతో దున్నితే తెలిసేది అసలు మజా! అంటూ అభిమానులు ఒకటే కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆ బ్యాక్ గ్రౌండ్ లో ఎప్పాడి ఇరుంత నాంగా అంటూ సాంగ్ కూడా రంజుగానే సాగుతోంది.
“సాహిత్యం వింటూ ఈ వీడియో చూడండి .. నేను ఈ ప్రత్యేకమైన సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు సరిగ్గానే ఆలోచిస్తున్నాను! ఈ పాత్రను నేను ఎంతగా ఎంజాయ్ చేశానో మీరు చూస్తారనే అనుకుంటున్నాను ” అంటూ ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది రష్మిక. కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది.
New post 😍💕@iamRashmika
Entirely a different character for our Rosh in #Sulthan 😍💕🤗#RashmikaMandanna #Sulthan3rdSingle pic.twitter.com/4rif39eLdU— 𝗩𝗶𝗷𝗮𝘆 𝗥𝗮𝘀𝗵𝗺𝗶𝗸𝗮 𝗟𝗼𝘃𝗲𝗿'𝘀🦋 (@VROP_offcl) March 17, 2021