ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి ‘విజయ రాఘవన్’ సినిమా సిద్ధమవుతోంది. ఆనంద్ కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, విజయ్ ఆంటోని సరసన నాయికగా ‘ఆత్మిక’ అలరించనుంది.ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో ‘గరుడ’ రామ్ నటించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
రౌడీ గ్యాంగులు .. రాజకీయనాయకులు .. ఆధిపత్య పోరు .. మధ్యలో నలిగిపోయే సామాన్య ప్రజలు .. వాళ్లకి మంచి చేయబోయే ప్రయత్నంలో హీరో ఎదుర్కునే పరిణామాలే ఈ సినిమా కథ అనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. కాకపోతే విజయ్ ఆంటోనికి డబ్బింగ్ వాయిస్ సెట్ కాలేదని అనిపిస్తోంది. రెగ్యులర్ గా విశాల్ కి చెప్పించే వారితో విజయ్ ఆంటోనికి చెప్పించారు గానీ నప్పలేదు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.