ఓ వైపు కరోనా విలయతాండవం చేస్తుంటే మరోవైపు వరుస సినిమాలు రిలీజ్ చేస్తూ తన విలక్షణత చాటుకున్నారు వర్మ. తన సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. సమాజంలో జరుగుతున్న సంఘటనలపై అలాగే సినీ, రాజకీయ ప్రముఖులపై వరుస కామెంట్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ తనయుడు, హీరో అల్లు శిరీష్ సిక్స్ ప్యాక్ లుక్ షేర్ చేస్తూ తనదైన కోణంలో కామెంట్ వదిలారు వర్మ.
‘ఈ నా కొడుకు కెనాన్ ద బార్బేరియన్ హీరో ఆర్నాల్డ్ కొడుకు కాదు. అల్లు అరవింద్ కొడుకు. అల్లు సార్.. మీకు జోహార్’ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో అల్లు శిరీష్ లేటెస్ట్ లుక్ షేర్ చేశారు వర్మ. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్స్ భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఏదేమైనా ట్రెండింగ్ అంశాలతో ఆన్ లైన్ సెన్సేషన్స్ క్రియేట్ చేయడంలో వర్మ ఫుల్ సక్సెస్ అవుతున్నారనే చెప్పుకోవచ్చు.
Ee Naa koduku CONAN the BARBARIAN Arnold Schwarzenegger koduku Kaadhu..Allu Aravind koduku ……Allu Saaarrr Mee ….Ki….Joharrr🙏🙏🙏 pic.twitter.com/iojyy5E9sy
— Ram Gopal Varma (@RGVzoomin) May 22, 2021