రాయలసీమ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా క్రిష్ కొండపొలం అనే సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. వైష్ణవ్‌తేజ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘కొండపొలం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శుక్రవారం ఫస్ట్‌లుక్‌తో పాటు వీడియాగ్లింప్స్ను విడుదల చేశారు. ఇందులో వైష్ణవ్‌తేజ్ గడ్డంతో రఫ్‌లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు.
తాజాగా ఈ సినిమా నుండి రకుల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇందులో రకుల్ పూర్తి గ్రామీణ యువతిగానే కనిపించింది. రకుల్ లుక్ కూడా ఆకట్టుకునేలా ఉంది. నల్లమల అడవిలో సామాన్య గొర్రెలకాపరులు చేసే సాహసోపేతమైన జీవనపోరాటం ఇతి వృత్తంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 8న థియేటర్స్‌లో విడుదల చేయనున్నారు.
వైష్ణవ్ తేజ్ రెండో సినిమాగా రూపొందిన ఈ చిత్రానికి కీరవాణి అందించిన నేపథ్య సంగీతం.. జ్ఞాన శేఖర్ ఛాయాగ్రహణం ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అటవీ నేపథ్యంలో అడ్వెంచరస్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో వైష్ణవ్.. కటారు రవీంద్ర యాదవ్‌గా కనిపించనున్నాడని సమాచారం. ఓబులమ్మ అనే గ్రామీణ యువతిగా రకుల్ కనిపించనుంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.
Obulamma is all heart ❤️ give her all your love ! #kondapolam https://t.co/FNTe9pgryP @DirKrish @FirstFrame_Ent #PanjaVaisshnavTej
— Rakul Singh (@Rakulpreet) August 23, 2021