రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న తమిళ చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకుడు. నయనతార కథానాయిక. ఈ చిత్రం తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదలకానుంది. దీపావళి కానుకగా నవంబరు 4 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా టాలీవుడ్ నటుడు వెంకటేశ్ టీజర్‌ని విడుదల చేశారు. రజనీకాంత్ అభిమానులు కోరుకునే అన్ని అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతుంది. రజనీకాంత్ లుక్స్, నటన ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘ఉప్పెనరా.. వాడికి అడ్డూ లేదు.. ఒడ్డూ లేదు’ అనే డైలాగ్ అలరిస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్, మీనా, ఖుష్బూ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: డి. ఇమ్మాన్, ఛాయాగ్రహణం: వెట్రి.
The teaser of #Peddhanna looks fantastic ! 👌👌 Best wishes to Superstar @rajinikanth garu !
▶️https://t.co/vcY5xHZ3If#PeddhannaDeepavali @directorsiva #Nayanthara @KeerthyOfficial #NarayandasNarang @SBDaggubati @AsianCinemas_ @AsianSuniel @sunpictures
— Venkatesh Daggubati (@VenkyMama) October 23, 2021