ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో రాధే శ్యామ్ చిత్రం ఒకటి. పిరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నారు. 1980లలో యూరప్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్ స్టోరి ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఆ కాలం నాటి సెట్లు నిర్మించి యాక్షన్ సన్నివేశాల్ని అంతే హైలైట్‌గా తీర్చిదిద్దారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ అభిమానులను ఆకట్టుకున్నాయి.
రెబల్ స్టార్ డా.యూ.వి.కృష్ణంరాజు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్ధలు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ల మీద వంశీ, ప్రమోద్, ప్రసీద (ప్రభాస్ సిస్టర్) ఈ పాన్ ఇండియా సినిమాను భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ‘రాధే శ్యామ్’ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యనున్నట్లు చెప్తూ.. ‘న్యూ ఇయర్.. న్యూ బిగినింగ్స్.. అండ్ ఎ న్యూ రిలీజ్ డేట్’ అంటూ 2022 జనవరి 14న డేట్ ఫిక్స్ చేసేశారు.
As we celebrate Janmashtami, let Vikramaditya and Prerna teach you a new meaning of love! 💕
Here's wishing you all a very Happy Janmashtami! #RadheShyamStarring #Prabhas & @hegdepooja pic.twitter.com/LqTUgADq7Q
— UV Creations (@UV_Creations) August 30, 2021