ప్రభాస్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా రూపొందుతున్న ‘రాధే శ్యామ్’ చిత్రానికి సంబంధించిన కొత్త టీజర్ ఈ నెల 14న విడుదల కానుంది. ఇందుకోసం కథానాయిక పూజ హెగ్డే సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పింది. ఈ విషయాన్ని తానే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
* బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న మూడో సినిమా టైటిల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి ‘మోనార్క్’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. అయితే, టైటిల్ ఇంకా ఏదీ ఖరారు చేయలేదని తాజాగా బోయపాటి క్లారిటీ ఇచ్చారు. టైటిల్ ప్రకటించడం కోసం ఇంకా చాలా సమయం ఉందని ఆయన పేర్కొన్నారు.
* పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పిరీడ్ మూవీ కోసం హైదరాబాదులో భారీ సెట్స్ వేస్తున్నారు. ఇందులో భాగంగా చార్మినార్ సెట్ కూడా వేస్తున్నారని తెలుస్తోంది. 17వ శతాబ్దం నాటి వాతావరణంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Early morning dub for our teaser..14th Feb, here we come ☺️😉 #soundon🔊 #RadheShyam pic.twitter.com/FzYYwwtjhX
— Pooja Hegde (@hegdepooja) February 9, 2021