కన్నుగీటుతో కోట్లాది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్. టాలీవుడ్‌కు చెక్ సినిమాతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఆర్బీ చౌదరి సమర్పణలో మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఇష్క్ చిత్రంలో తేజ సజ్జా సరసన కథానాయికగా నటించింది. యస్.యస్. రాజు అనే దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఏప్రిల్ 23న ఇష్క్ చిత్రం విడుదల కానుండగా, ఈ మూవీ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ రోజు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయగా, దీనికి సంబంధించి ఫన్నీ వీడియోలు రూపొందించారు. ఇవి నెటిజన్స్‌కు నవ్వు తెప్పిస్తున్నాయి. ఇక ప్రియా ప్రకాశ్ వారియర్ గంగవ్వతో కలిసి చేసిన వీడియో సైతం ఆకట్టుకుంటుంది. కన్నుకొట్టుడు కాదు మూతులు తిప్పుడంటూ.. ప్రియాకు మూతి తిప్పుడు ట్రైనింగ్ ఇచ్చింది గంగవ్వ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.
#Gangavva to #PriyaPvarrier: Kannu kottinantha Veasy kadu Muthi Thippudu 😎😏✌🏻#ISHQ Not a love story! Releasing on April 23rd!! ❤️#ISHQFromApril23rd@tejasajja123 #SSRaju #RBChoudary #NVPrasad #ParasJain @haashtagmedia pic.twitter.com/FbViJcSjmu
— Team VamsiShekar (@TeamVamsiShekar) April 17, 2021