డార్లింగ్ ప్రభాస్ బర్త్ డే అంటూ గత రెండు మూడు నెలల నుంచి సోషల్ మీడియాలో హంగామా మొదలైంది. అయితే ఈ బర్త్ డే మాత్రం అప్డేట్ల వరద ఉంటుందని ముందే అంతా ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమాలకు సంబంధించిన అప్డేట్లు నేడు వరుసబెట్టి రాబోతోన్నట్టు తెలుస్తున్నాయి. అన్నింటి కంటే ముందుగా రాధేశ్యామ్ నుంచి అదిరిపోయే వీడియో వచ్చేసింది. టీజర్ విడుదల చేసిన సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేశారు. గత కొన్ని నెలల నుంచి రాధేశ్యామ్ అప్డేట్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
అప్డేట్లు ఆలస్యంగా ఇస్తున్నారని దర్శకుడు రాధాకృష్ణ, నిర్మాత యూవీ సంస్థ మీద డార్లింగ్ ఫ్యాన్స్ ఎన్నో సార్లు ట్రోల్స్ చేశారు. దారుణంగా తిట్టిపోశారు. కానీ వారు మాత్రం అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా అప్డేట్లు ఇవ్వలేకపోయారు. కానీ ఇన్ని రోజుల ఆకలిని ఈ రోజు తీర్చేశారు. ప్రభాస్ బర్త్ డే సందర్బంగా వదిలిన ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.