నూతన నటీనటులు దినేశ్ తేజ్, అర్జున్ కల్యాణ్, స్పందన, అనన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్లే బ్యాక్’. హరిప్రసాద్ జక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘ప్లేబ్యాక్’ ట్రైలర్‌ను శుక్రవారం ఉదయం కథానాయకుడు శ్రీవిష్ణు విడుదల చేశారు. ‘ఆ ఫోన్ చూశావు కదా. దానికి కనెక్షన్ లేదు. అయినా ఒకరోజు కాల్ వచ్చింది. లిఫ్ట్ చేశా. మాట్లాడా. మాట్లాడిన తర్వాత తెలిసిందేమిటంటే మేమిద్దరం రెండు విభిన్నమైన టైమ్ లైన్స్‌లో ఉన్నామని..’ అంటూ దినేశ్ తేజ్ చెప్పే డైలాగ్‌లతో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.