లాయర్ రామచంద్రగా సత్యదేవ్ పాత్రను హైలైట్ చేస్తూ ఈ ట్రైలర్ కొనసాగింది. కేసును గెలిపించడం కోసం అవసరమైతే తన డబ్బును ఖర్చు చేసే నిజాయితీ పరుడిగా ఆయన పాత్రను చూపించారు. అలా అందరికీ సాయం చేస్తూ, కారు నుంచి బైక్ రేంజ్ కి పడిపోయిన తీరును గురించి చెప్పారు. ఈ కథ అంతా కూడా ఒక మర్డర్ కేసు తిరుగుతుంది.
“నీ ముందున్నది ‘వాలి’ అని మరిచిపోకు లాయర్ రామచంద్ర .. ఎదురుగా వస్తే సగం బలం లాగేస్తా” అని క్రిమినల్ అంటే, “నువ్వు సగం బలం లాగే వాలివైతే, దండేసి దండించే రాముడి లాంటివాడిని నేను” అని హీరో చెప్పే డైలాగ్ హైలైట్ గా అనిపిస్తోంది. ట్రైలర్ ను చూస్తుంటే సినిమాపై అంచనాలు పెంచేదిలానే ఉంది.