నితిన్, నభా నటేశ్ జంటగా రూపొందిన చిత్రం ‘మాస్ట్రో’. ప్రముఖ నాయిక తమన్నా కీలక పాత్ర పోషించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్ వేదికగా త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేసింది. ఆసక్తికర సన్నివేశాలతో ఈ ట్రైలర్ ఆద్యంతం అలరించేలా ఉంది. అంధుడిగా నితిన్ నటన మెప్పిస్తోంది. నాయికల అందం కనువిందు చేస్తోంది. నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. ఈ చిత్రం హిందీలో విజయవంతమైన ‘అంధాధున్’ రీమేక్‌గా రూపొందింది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. కథానాయకుడిగా నితిన్‌కి ఇది 30వ చిత్రం.