మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నితిన్ జోడీగా నభా నటేశ్ నటిస్తోంది. ఈ రోజున ‘శ్రీరామనవమి’ కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఒక కొత్త పోస్టర్ ను వదిలారు. స్కూటర్ ను నభా నటేశ్ నడుపుతూ ఉండగా.. అంధుడి పాత్రను పోషిస్తున్న నితిన్ ఆమె వెనక కూర్చుని ఉన్నాడు. పోస్టర్ చాలా కలర్ ఫుల్ గా ఉంది. తమన్నా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాలో, జిషు సేన్ గుప్తా పాత్ర కీలకం కానుంది. మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను, జూన్ 11న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.