సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. ఈ క్రమంలోనే నిత్యం ఫ్యాన్స్‌తో ఎన్నో విషయాలను పంచుకుంటుంటాడు. ఇందులో భాగంగానే తాజాగా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌ను నిర్వహించాడు. ఈ సందర్భంగా చాలా మంది నెటిజన్లు నయనతారతో రిలేషన్ గురించి అతడిని ప్రశ్నలు అడిగారు.
ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో విఘ్నేష్ శివన్ తమ పెళ్లి ఆలస్యం అవడానికి అసలు కారణం చెప్పిన విషయం తెలిసిందే. అదే సమయంలో నయనతార గురించి పర్సనల్ విషయాలను కూడా అడిగారు కొందరు. వీటికి ఏమాత్రం అసహనం వ్యక్తం చేయకుండా సమాధానాలు చెప్పాడతను. ఈ క్రమంలోనే ఓ ఔత్సాహిక నెటిజన్ ‘నయనతారను కిస్ చేస్తున్న ఫొటోను పెట్టండి’ అని అడిగాడు.
కిస్ చేస్తున్నప్పటి ఫొటోను షేర్ చేయమన్న నెటిజన్‌కు విఘ్నేష్ శివన్ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. దీనిపై స్పందిస్తూ.. ‘కిస్ చేస్తున్నప్పుడు నేను బిజీగా ఉంటాను. కాబట్టి ఎవరైనా ఉంటే మా ఇద్దరి ముద్దును ఫొటో తీయొచ్చు’ అంటూ ఊహించని సమాధానం చెప్పాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండడం విశేషం.