నాచురల్ స్టార్ నాని పుట్టినరోజు కానుకను సిద్ధం చేసింది ‘టక్ జగదీష్’ యూనిట్. ఈ మేరకు చిత్ర మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు యూనిట్ సభ్యులు.
ఇటీవలే V సినిమాతో థ్రిల్ చేసిన నాచురల్ స్టార్ నాని ‘టక్ జగదీష్’ అనే మరో వైవిధ్యభరితమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాని కెరీర్లో 26వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే మరో మూడు రోజుల్లో నాని బర్త్ డే రానున్న నేపథ్యంలో ఓ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్.
నాని పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు ‘టక్ జగదీష్’ టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ మోషన్ పోస్టర్‌ను కూడా సంస్థ షేర్ చేసింది. ఈ పోస్టర్లో నాని మరోసారి సీరియస్ లుక్‌లో కనిపిస్తుండటంతో ప్రేక్షకుల్లో టీజర్‌పై ఆసక్తి పెరిగింది.
ఈ మూవీలో జగదీష్ నాయుడుగా నాని పవర్ఫుల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రావు రమేశ్, నాజర్, నరేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సినిమా విడుదల ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. గతంలో నాని- శివ నిర్వాణ కాంబోలో వచ్చిన ‘నిన్ను కోరి’ సినిమా సూపర్ హిట్ కావడంతో మరోసారి అదే కాంబోలో రాబోతున్న ‘టక్ జగదీష్’పై అంచనాలు పెరిగాయి.
A perfect gift for @NameisNani fans from Team #TuckJagadish🤩🤩#TuckJagadishTeaser will be released on 23rd Feb at 5:04PM#HappyBirthdayNani@riturv @aishu_dil @ShivaNirvana @MusicThaman @praveenpudi @sahugarapati7 @harish_peddi @sahisuresh @Shine_Screens @adityamusic pic.twitter.com/iz68iJKeEP
— Shine Screens (@Shine_Screens) February 20, 2021