మొత్తానికి సస్పెన్స్‌కి తెర దించారు నాని. గత కొద్ది రోజులుగా ఈ మూవీ రిలీజ్ అంశం చర్చనీయాంశంగా మారగా, కొద్ది సేపటి క్రితం నాని తన ట్విట్టర్లో ఓ వీడియో విడుదల చేస్తూ.. పండగకి మన ఫ్యామిలీతో టక్ జగదీష్ చూద్దాం అని అన్నాడు. వీడియోలో భూదేవిపురం చిన్న కొడుకు, నాయుడు గారి అబ్బాయి టక్ జగదీష్ చెబుతున్నాడు.. మొదలెట్టండి అని నాని డైలాగ్ చెప్పారు. సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
నిన్ను కోరి’ వంటి సూపర్ డూపర్ హిట్ మూవీ తర్వాత నేచురల్ స్టార్ నాని – శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘టక్ జగదీష్ చిత్రం ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందింది. ఈ సినిమాను గత వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావించారు. అయితే, కరోనా సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్య పడలేదు. ప్రస్తుతం థియేటర్స్ పరిస్థితులు కూడా పూర్తిగా కంట్రోల్లోకి రానుందన అమెజాన్ ప్రైమ్లోమూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.
టక్ జగదీష్ సినిమాను అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీన్ని షైస్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మిస్తున్నారు. ఇందులో టాలెంటెడ్ హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ నటిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. నాజర్, జగపతిబాబు, రావు రమేశ్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు.
పండగ కి మన Family తో…
మీ#TuckJagadish pic.twitter.com/sVVjSCsJlB— Nani (@NameisNani) August 27, 2021