ఆ జాబితాలో సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోన్నా సెబాస్టియన్ కనిపించనున్నారు. ఎవరి పాత్రకి తగిన ప్రాధాన్యత వారికి ఉంది. ఈ సినిమా ఓటీటీలో వస్తుందా? థియేటర్లకు వెళుతుందా? అనే విషయంపై అనేక రకాల ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ఈ సినిమా విడుదలకి డేట్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాను డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. తెలుగుతో పాటు, తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లోను అదే రోజున ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మిక్కీ జె. మేయర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా తన కెరియర్లోనే ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందని నాని నమ్మకంతో చెబుతున్నాడు
This Christmas
Shyam will arrive where he belongs 🙂
To the big screen and to your hearts 🤍TELUGU,TAMIL,MALAYALAM,KANNADA
DECEMBER 24th 🔥#ShyamSinghaRoy @Sai_Pallavi92 @IamKrithiShetty @MadonnaSebast14 @MickeyJMeyer @Rahul_Sankrityn @vboyanapalli@NiharikaEnt pic.twitter.com/pbMojsNhs8
— Nani (@NameisNani) October 18, 2021