ఒకప్పుడు హీరోలు నెగెటివ్ పాత్రలలో నటించేందుకు అస్సలు ఒప్పుకునే వారు కాదు. కాని ఇప్పుడలా కాదు. పాత్ర పవర్ఫుల్గా ఉంటే తమలోని విలనిజాన్ని ప్రదర్శించేందుకు సై అంటున్నారు.ఇప్పటికే దగ్గుబాటి రానా,కార్తికేయ, విజయ్ సేతుపతి వంటి హీరోలు విలన్గా అదరగొట్టారు. త్వరలో నాగ చైతన్య ఓ వెబ్ సిరీస్ కోసం విలన్గా మారబోతున్నాడు.ఇక ఇప్పుడు వీరి జాబితాలో హీరో నాని కూడా చేరనున్నట్టు తెలుస్తుంది.
తమిళ స్టార్ హీరో విజయ్ చివరిగా మాస్టర్ సినిమాతో ప్రేక్షకులని పలకరించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అదే ఉత్సాహంతో బీస్ట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని విలన్ పాత్ర పోశించబోతున్నాడట.
ఇప్పటికే ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన “వీ” సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించిన నాని ఇప్పుడు ఈ సినిమాలోఏకంగా విలన్ పాత్రలో కనిపించబోతున్నారని టాక్. దీనిపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్గా కీయారా అద్వానీ లేదా రష్మిక మందన్నలలో ఒకరిని ఎంపిక చేసుకోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అక్టోబర్ 27 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్టు తెలుస్తుంది.