లవ్‌స్టోరి’ చిత్రం ఓటీటీలోకి వస్తుందా, థియేటర్లలో విడుదలవుతుందా? ఇంతకీ ఎప్పుడొస్తుంది? అనే ప్రశ్నలన్నింటికీ తాజాగా తెరపడింది. ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది. వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు వెల్లడించింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రమిది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి.సంస్థ నిర్మించింది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రానికి సంగీతం: పవన్ సి.హెచ్., ఛాయాగ్రహణం: విజయ్ సి. కుమార్, కూర్పు: మార్తాండ్ కె. వెంకటేశ్. ఈ ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలున్నాయని వార్తలు వినిపించాయి.
This Vinayaka Chaviti is Extra Special! #LoveStory releasing in theatres near you on Sep 10th ! #LoveStoryFromSep10th@sekharkammula @Sai_Pallavi92 @pawanch19@SVCLLP #AmigosCreations @AsianSuniel @adityamusic @NiharikaGajula @GskMedia_PR pic.twitter.com/s7e8zJWU4v
— chaitanya akkineni (@chay_akkineni) August 18, 2021