అక్కినేని అభిమానులకు బ్యాడు న్యూస్.. అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్ చిత్రం లవ్ స్టోరీ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్రయూనిట్. తెలుగు రాష్ట్రాలలో కరోనా ఉదృతి పెరుగుతున్న కారణంగా మూవీ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు దర్శకనిర్మాతలు.. కరోనా పరిస్థితులు చక్కబడిన తరువాత విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. AMB మాల్లో ప్రెస్ మీట్ నిర్వహించిన లవ్ స్టోరీ చిత్రయూనిట్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఈ ప్రెస్ మీట్లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల, నాగ చైతన్య,నిర్మాతలు నారాయణ దాస్ నారాంగ్ సునీల్ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు పాల్గొన్నారు.
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ… సినిమా బాగా వచ్చింది. ఫైనల్‌గా రిలీజ్ చేయాలనుకునే సరికి మళ్లీ కొవిడ్ విజృంభిస్తోంది. పరిస్థితి చక్కబడిన తరువాత లవ్ స్టోరీ సినిమాను విడుదల చేస్తాము. మేము సినిమా విడుదల చేయడానికి రెడీగానే ఉన్నాము అని అన్నారు.
In the wake of rising COVID cases, Makers of #LoveStory @SVCLLP postponed the release of the film. New release date to be announced soon.https://t.co/4xap9WcpWn@chay_akkineni @sai_pallavi92 @sekharkammula @pawanch19 @iamMangli #AmigosCreations @adityamusic @niharikagajula pic.twitter.com/jtXkI9h2uP
— BARaju (@baraju_SuperHit) April 8, 2021