నాగచైతన్య – సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమా ఈ పాటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేసి ఉండేది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వెళ్లింది. ఇటీవలే థియేటర్లు తెరుచుకున్నాయి.. చిన్న సినిమాలు లైన్లోకి వచ్చేస్తూనే ఉన్నాయి. థియేటర్ల దగ్గర కూడా జనం పెరుగుతున్నారు.
ఈ నేపథ్యంలో నారాయణ దాస్ నారంగ్ – రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసుకుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ‘వినాయక చవితి’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమాను వచ్చేనెల 10వ తేదీన విడుదల చేయాలనుకుంటున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు.