టాలీవుడ్ యువ నటుడు అఖిల్ అక్కినేని , పూజా హెగ్డే నటిస్తోన్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ‘మన లైఫ్ పార్ట్నర్ తో కనీసం 9000 నైట్స్ కలిసి పడుకోవాలి. వందల వెకేషన్స్ కు వెళ్లాలి. అన్నింటికీ మించి కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి. అలాంటి వాడెవడు అంటూ పూజా హెగ్డే సంభాషణలతో మొదలైంది ట్రైలర్. ఒక అబ్బాయి జీవితంలో 50 శాతం కెరీర్, 50 శాతం మ్యారేజ్ లైఫ్. మ్యారేజ్ లైఫ్ బాగుండాలంటే కెరీర్ బాగుండాలంటూ’ అఖిల్ చెప్తున్న డైలాగ్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ టైటిల్ కు సరిపడేలా సాగుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.