వరుస విజయాలతో దూసుకెళ్తున్న సమంత అక్కినేని ఫ్యాన్స్‌కి, ది ఫ్యామిలీ మ్యాన్ అభిమానులకు చేదు వార్త. ఫిబ్రవరి 12 అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానున్న ఈ పాపులర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌ను నిర్మాత, దర్శకులు వాయిదా వేసినట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. అయితే ఈ వెబ్ సిరీస్ రిలీజ్ వాయిదా ఎప్పుండంటే…
ది ఫ్యామిలీ మ్యాన్ సూపర్ హిట్
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రిలీజైన ది ఫ్యామిలీ మ్యాన్ తొలి సీజన్ భారీగా విజయవంతమైంది. మనోజ్ బాజ్‌పేయ్, ప్రియమణి తదితరులు నటించిన ఈ వెబ్ సిరీస్‌కు అన్ని భాషల్లో అనూహ్యమైన స్పందన లభించింది. దాంతో దాని సీక్వెల్‌పై అంచనాలు భారీగా పెరిగాయి.
సమంత కీలక పాత్రతో ది ఫ్యామిలీ మ్యాన్ 2
అనూహ్యమైన ప్రేక్షకాదరణను మూటగట్టుకొన్న ది ఫ్యామిలీ మ్యాన్ సీక్వెల్‌ను సరికొత్తగా అందించేందుకు నిర్మాత, దర్శకులు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే ప్రయత్నాలు చేశారు. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో సమంత అక్కినేని తెరపైకి తీసుకొచ్చి ఈ ప్రాజెక్టును మరింత ఆకర్షణీయంగా మార్చారు. ఈ వెబ్ సిరీస్‌లో సమంత ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.
ది ఫ్యామిలీ మ్యాన్ 2 వాయిదా అంటూ అయితే
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2ను ఫిబ్రవరి 12వ తేదిన రిలీజ్ చేయాలని రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే నిర్ణయించారు. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అధికారికంగా ప్రకటన చేశారు. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్‌ను వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నమని యూనిట్ తెలియజేసింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వార్తను చేరవేయడంతో ప్రేక్షకులు కాస్త నిరాశకు గురయ్యారు.
మీ ఆదరణకు రుణపడి ఉన్నాం
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 కోసం మీరంత ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు. మాపై మీరు చూపిస్తున్న ఆదరణకు ఎంతో రుణపడి ఉన్నాం. కానీ ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌ను ఫిబ్రవరి 12న కాకుండా వేసవిలో మీ ముందుకు తీసుకు రావాలని నిర్ణయించాం అని రాజ్, కృష్ణ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు