మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకుంటున్నట్టు గత కొన్ని రోజులుగా మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత కొన్ని నెలల పాటు స్నేహితులతో కలిసి దేశం అంతా కలియ తిరిగాడు. ప్రస్తుతం ‘అహం బ్రహ్మాస్మి’ సినిమా చేస్తున్నాడు. ఆ సంగతి పక్కన పెడితే.. భార్యతో విడాకుల తర్వాత మంచు మనోజ్‌కు ఇంట్లో వాళ్లు రెండో పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. దీంతో మంచు మనోజ్ రెండో పెళ్లికి ఓకే చెప్పినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా మంచు మనోజ్.. తన రెండో పెళ్లి విషయమై వస్తున్న వార్తలపై తొలిసారి స్పందించారు. మీడియాలో తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై కాస్త వ్యంగ్యంగా స్పందించారు. నా పెళ్లి తేదీ, ముహూర్తం జరిగే టైమ్ కూడా మీరే చెప్పేయండి అంటూ బ్రహ్మానందం ఫోటోను షేర్ చేసాడు. మనోజ్ చేసిన ట్వీట్‌తో ఆయన పెళ్లి వార్తలపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టినట్టు అయింది.
మంచు మనోజ్ విషయానికొస్తే.. ‘దొంగ దొంగది’ సినిమాతో హీరోగా పరిచయ్యాడు. అంతకు ముందు బాలనటుడిగా పలు సినిమాల్లో నటించిన సత్తా చాటాడు. ఆ తర్వాత ‘వేదం’, ఝమ్మంది నాదం’, ‘పోటుగాడు’, వంటి చిత్రాల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. 2015లో మంచు మనోజ్ పెళ్లి ప్రణతీ రెడ్డితో జరిగింది. ఆ తర్వాత వీళ్లిద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని 2019లో మంచు మనోజ్ ప్రకటించారు.
మంచు మనోజ్ తన పర్సనల్ లైఫ్‌లో వచ్చిన సమస్యల కారణంగానే మూడేళ్ళ పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు మనోజ్. ప్రస్తుతం ‘అహం బ్రహ్మస్మి’తో వస్తున్నాడు. ఈ చిత్రంతో శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. ఏదేమైనా కూడా మనోజ్ రెండో పెళ్లి వార్త మాత్రం ఇప్పుడు ట్రెండ్ అవుతుంది.
Dateu timeu kuda meere chepaiandi 😜😂 https://t.co/pBuUbK4I2K pic.twitter.com/aNVk5CRYn0
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 6, 2021