టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కమ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఫలక్నుమా దాస్. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమా బాక్సాపీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ నేటికి 3 ఏండ్లే పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఫలక్ నుమా దాస్ ముహూర్తపు సెర్మనీకి సంబంధించిన త్రో బ్యాక్ స్టిల్ ను విశ్వక్ సేన్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్నాడు.
మూడేళ్ల క్రితం ఫలక్నుమా దాస్ ముహూర్తపు షాట్. నిన్ననే జరిగినట్టుంది అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. మరోవైపు ఈ చిత్రానికి సీక్వెల్ ఫలక్ నుమా దాస్ 2 ఉంటుందని ఈ సందర్భంగా ప్రకటించాడు విశ్వక్ సేన్. మలయాళం యాక్షన్ డ్రామా అంగమలై డైరీస్ కు ఇది రీమేక్. ఆసక్తికర విషయమేంటంటే మలయాళ వెర్షన్ కు సీక్వెల్ లేదు. మరి ఫలక్ నుమా దాస్ 2 ను ఎలాంటి కథాంశంతో తెరకెక్కిస్తాడో చూడాలి.