ఈ మధ్య కాలంలో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు చేస్తున్న వ్యాఖ్యలు తెలుగు ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మా ఎన్నికల సందర్భంగా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పటికీ వేడి రాజేస్తున్నాయి. అధ్యక్షుడిగా పోటీలోకి దిగిన ప్రకాశ్ రాజ్ క్రమశిక్షణపై ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తాను ప్రకాశ్ రాజ్ కలిసి 15 సినిమాలకు పైగా నటించామని.. ఒక్కసారి కూడా ఆయన షూటింగ్‌కు సమయానికి రాలేదని.. అలాంటి వ్యక్తిని అధ్యక్షుడిగా గెలిపిస్తే ఏం చేస్తాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు కోట శ్రీనివాసరావు. ఈ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు సీరియస్‌గా స్పందించాడు. కొంతమందికి వయసు పెరుగుతుంది కానీ బుద్ధి పెరగదు.. రేపోమాపో పోయే కోట ఇంకా ఎప్పుడు మారతాడు అంటూ తీవ్ర పదజాలంతో కాస్త నోటి దురుసు చూపించాడు. దీనిపై ఇండస్ట్రీలో ఉన్న పలువురు పెద్దలు కూడా నాగబాబు వ్యాఖ్యలను తప్పుబట్టారు. అయితే నాగబాబు కామెంట్స్‌పై అప్పుడు కోట ఏమీ స్పందించలేదు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కోట శ్రీనివాసరావు.. నాగబాబు కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చాడు.
నాగబాబు గురించి కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మెగా బ్రదర్ అనే గుర్తింపు తప్ప నాగబాబు కి ఏం గుర్తింపు ఉందని ప్రశ్నించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లేకపోతే ఆయన్ను ఎవరు పట్టించుకోరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతంలో తనపై నాగబాబు కామెంట్స్ చేసినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదని.. తాను కూడా నాగబాబులా నోరు జారి ఉంటే టీవీలో డిబెట్లకు ఆ టాపిక్ వచ్చేదని చెప్పుకొచ్చాడు. అనవసరంగా ఆయన గురించి మాట్లాడనని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చాడు. మరి కోట వ్యాఖ్యలపై నాగబాబు ఎలా స్పందిస్తాడో చూడాలి.ఇటీవల యాంకర్ అనసూయ భరద్వాజ్ పై కోట శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈమె మంచి నటి కానీ అలాంటి బట్టలు వేసుకోవడం ఎందుకు అంటూ అనసూయపై కామెంట్ చేశాడు. దీనిపై అనసూయ కూడా ఘాటుగానే స్పందించింది.