కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న కత్రినా మళ్లీ కసరత్తులు, సినిమా షూటింగులతో బిజీ అయిపోయింది. కాగా కత్రినా తదుపరి చిత్రం గురించి తాజా అప్డేట్ వచ్చింది. శ్రీరామ్‌రాఘవన్ దర్శకత్వంలో రాబోతున్న ఓ చిత్రంలో తమిళ హీరో విజయ్‌సేతుపతి పక్కన కథానాయకిగా నటించేందుకు చర్చలు జరుగుతున్నాయి.
సంతోష్ శివన్ ‘ముంబయ్కర్’ చిత్రం విజయ్‌సేతుపతికి బాలీవుడ్లో తొలిచిత్రం కాగా, ఇది రెండో చిత్రం కానుంది. ఇటీవల వైవిధ్యమైన పాత్రలతో సత్తా చాటిన విజయ్ నుంచి రాబోతున్న ఈ చిత్రం.. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అటు ప్రస్తుతం ‘టైగర్’ సిరీస్‌తో బిజీగా ఉంటోంది బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి కత్రినా. ఆ షూటింగ్ పూర్తవ్వగానే శ్రీరామ్‌రాఘవన్ చిత్రం మొదలవ్వనుంది.