ఈ మధ్యే కొవిడ్ బారిన పడి పూర్తిగా కోలుకున్న బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్.. తాజాగా ఖరీదైన లాంబోర్గిని కారు కొన్నాడు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో అతడు కాస్త ఫన్నీగా చెప్పాడు. కొనేశాను.. కానీ ఇలాంటి ఖరీదైన వస్తువులు నాకు సరిపడవేమో అని కార్తీక్ ఆర్యన్ కామెంట్ చేశాడు. కారు కొన్న సందర్భంలో వెనుక కాన్ఫెట్టి పేలగానే అతడు ఉలిక్కి పడటం వీడియోలో చూడొచ్చు. దీనిని ఉద్దేశించే అతడు ఇన్స్టాలో ఆ కామెంట్ చేశాడు.
ఈ కారు ఖరీదెంతో అతడే ట్విటర్లో వెరైటీగా చెప్పాడు. ఒకేసారి రూ.1.5 కోట్లు తక్కువ చేసేసావు కదా అని తనకు తానే ట్విటర్లో కామెంట్ పెట్టుకున్నాడు కార్తీక్ ఆర్యన్. సోమవారం రాత్రి తన ఇంటి ముందు ఈ కొత్త కారుతో అతడు ఫొటోలకు పోజులిచ్చాడు. అంతకు కొన్ని గంటల ముందే నా 14 రోజుల వనవాసం పూర్తయింది.. మళ్లీ పని మొదలుపెట్టాను అంటూ కొవిడ్ నుంచి కోలుకున్న విషయాన్ని అతడు చెప్పాడు.
Dreams do come true! 🚘
Congratulations, #KartikAaryan! 👏#IIFA #Bollywood @TheAaryanKartik pic.twitter.com/RilFa3VI8U
— IIFA (@IIFA) April 6, 2021