మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ముఖ్యపాత్రలో నటించిన సినిమా ‘మోసగాళ్లు’. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల ఆలస్యమైంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాను విడుదల తేదితో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను ఏ టైటిల్‌ను ప్రకటించారు.
‘ఢీ, దూసుకెళ్తా, దేనికైనా రెడీ’ వంటి హిట్ చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మంచు విష్ణు తాజాగా నటిస్తోన్న చిత్రం ‘మోసగాళ్లు’. ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రదారులుగా నటించిన ఈ చిత్రాన్ని విష్ణు మంచు అత్యంత భారీ బడ్జెట్ తో హై టెక్నికల్ వేల్యూస్‌తో నిర్మించారు. ప్రపంచంలో జరిగిన బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదల తేదీని చిత్రయూనిట్ ప్రకటించింది. మార్చి 19న తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ‘మోసగాళ్లు’ విడుదల కానున్నట్లు కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు తెలిపారు.
Wishing the Best for #Mosagallu team. @iVishnuManchu @MsKajalAggarwal @SunielVShetty. Looking forward for your success on the 19th of March. pic.twitter.com/gK7FlsQJPg
— Mohan Babu M (@themohanbabu) March 7, 2021
’మోసగాళ్లు’ చిత్రానికి జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించారు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ అన్నా చెల్లెల్లుగా నటించడం విశేషం.
హిందీ వెర్షన్‌తో పాటు కన్నడ, తమిళంలో ఈ సినిమాను ’అను అండ్ అర్జున్’ టైటిల్‌తో వస్తోంది.
హిందీ వెర్షన్‌తో పాటు కన్నడ, తమిళంలో ఈ సినిమాను ’అను అండ్ అర్జున్’ టైటిల్‌తో వస్తోంది. మంచు విష్ణు కెరీర్లో ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ. అంతేకాదు తన మార్కెట్ పరిధిని దాటి ఈ సినిమా కోసం ఖర్చు చేసాడు.
మలయాళంలో మాత్రం ఈ సినిమాను ‘అర్జున్ అండ్ అను’ టైటిల్‌తో విడుదల చేస్తున్నారు..
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. 2016లో జరిగిన 450 మిలియన్ డాలర్ల స్కామ్ నేపథ్యంలో తెరకెక్కించారు.ఇందులో అర్జున్ పాత్రలో నటిస్తున్నాడు విష్ణు. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటి స్కామ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుంది.
ఇతర ముఖ్యపాత్రల్లో సునీల్ శెట్టి, నవదీప్ నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. మొత్తంగా స్క్రీన్ ప్లే బేస్డ్గా ఈ సినిమాను తెరకెక్కించారు.
కన్నడ, హిందీ, తమిళంలో ‘అను అండ్ అర్జున్’ టైటిల్‌తో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.