టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడిగా అడుగుపెట్టి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అంతేకాదు ఇన్నేళ్ల కెరీర్లో సినిమాలే కాదు. బిగ్‌బాస్ వంటి రియాలిటీ షోను తెలుగు ప్రేక్షకులకు మొదటగా పరిచయం చేసింది ఎన్టీఆరే. ఈయన హోస్ట్‌గా ఈ షోను తనదైన శైలిలో సూపర్ హిట్ చేసాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉండటంతో ఈయన బిగ్‌బాస్ తర్వాత సీజన్స్‌కు హోస్ట్‌గా కంటిన్యూ చేయలేకపోయాడు. ఆ తర్వాత బిగ్‌బాస్ షోలో ఎన్టీఆర్ ప్లేస్‌లో సెకండ్ సీజన్‌ను నాని హోస్ట్ చేస్తే.. మూడో, నాల్గో సీజన్లను నాగార్జున హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా.
ఆ సంగతి పక్కన పెడితే… ఎన్టీఆర్ మరోసారి స్మాల్ స్క్రీన్ పై సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. నాగార్జున అప్పట్లో హోస్ట్ చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ తరహాలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే రియాలిటీ షోను హోస్ట్ చేయబోతున్నట్టు జెమినీ టీవీ అఫీషియల్‌గా ప్రకటించింది. ఇప్పటికే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ .. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోమోను రెడీ చేస్తున్నాడు.
మార్చి ఫస్ట్ వీక్ నుంచి షోకి సంబంధించి ఎంట్రీస్ తీసుకుంటారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ అంతా వేగంగా జరుగుతుంది. ట్రిపుల్ ఆర్ షూటింగ్ జరుగుతున్నా కూడా ఈషో కోసం కూడా కొన్ని డేట్స్ ఇచ్చాడు తారక్.
ఒక్కో ఎపిసోడ్ కోసం భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. చాలా రోజుల కింద దీనిపై ఊహాగానాలు వచ్చాయి కానీ కరోనా కారణంగా షోపై అప్ డేట్స్ బయటికి రాలేదు. ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో మళ్లీ షోకు మెరుగులు దిద్దుతున్నారు నిర్వాహకులు. ఎంటర్టైన్మెంట్ ప్లస్ నాలెడ్జ్ కూడా ఉండటంతో కచ్చితంగా ఈ షో మంచి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నారు నిర్వాహకులు. దీనికోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు. షోను కూడా భారీ స్థాయిలోనే లాంఛ్ చేయబోతున్నారు. గతంలో ఎన్టీఆర్ ఓ టెలి సిరీయల్లో నటించాడు. ఈ సీరియల్ పేరు ‘భక్త మార్కండేయ’. ఈ సీరియల్లో ఎన్టీఆర్ టైటిల్ రోల్ భక్త మార్కండేయుని పాత్రలో నటించాడు. ఈ సీరియల్ అప్పట్లో ఈటీవీలో ప్రసారం అయింది. ఈ సీరియల్ తర్వాత ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో హీరోగా తన సత్తా ఏంటో చూపించాడు. ఈ యేడాది ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో కలిసి నటిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఈ యేడాది అక్టోబర్ 13న తేదిన దసరా కానుకగా విడుదల కానుంది.
ఎవరు మీలో కోటీశ్వరులు | Gemini TV
మీ జీవితాలని మార్చే గేమ్ షో , మీ ఆశలని నిజం చేసే గేమ్ షో "ఎవరు మీలో కోటీశ్వరులు " త్వరలో మీ జెమినీ టీవీ లో రాబోతుంది సిద్ధంగా ఉండండి . #ఎవరుమీలోకోటీశ్వరులు#GeminiTV #EvaruMeeloKoteeswarulu#EMKonGeminiTV#EvaruMeeloKoteeswaruluonGeminiTV pic.twitter.com/CpFuZtmrwm— Gemini TV (@GeminiTV) March 7, 2021