హృతిక్ రోషన్, దీపికా పదుకొణె జంటగా భారీ స్థాయిలో తెరకెక్కనున్న చిత్రం ‘ఫైటర్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని మనదేశంలోనే తొలి ఏరియల్ యాక్షన్ ఫ్రాంఛైజీగా తెరకెక్కించనున్నారు. ముందుగా ఈ సినిమాని సెప్టెంబరు 2022 విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. తాజాగా మరో కొత్త తేదీని ప్రకటించారు. జనవరి 26, 2023న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ వయాకామ్ 18 స్టూడియోస్ ట్విటర్ ద్వారా ప్రకటించింది. సిద్ధార్థ్ ఆనంద్ ప్రస్తుతం షారుక్‌ఖాన్ ‘పఠాన్’ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఇది పూర్తయ్యాకా ‘ఫైటర్’ కోసం రంగంలోకి దిగుతారు.
On #RepublicDay 2023 get ready to experience India’s first aerial action franchise as #Fighter starring @iHrithik & @deepikapadukone arrives at the box office! #SiddharthAnand @Viacom18Studios @MarflixP @itsMamtaA @ankupande @ramonchibb
— Ajit Andhare (@AndhareAjit) August 13, 2021