‘‘పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చాలా ఓపికగా ప్రేమగా కరెక్ట్ చేస్తారు. అదేంటో… కాస్త మీసాలు వచ్చేసరికి పెద్దోళ్లు ఏం చేసినా ఊరికే చిరాకులు వచ్చేస్తాయి. కోపాలు వచ్చేస్తాయ’’న్న నిజాన్ని విన్న ఓ కుర్రాడు ‘‘నేను కూడా మా నాన్నని కాస్త ఓపిగ్గా ప్రేమగా అడగాల్సింది సార్’’ అంటున్నాడు. మరి ఆ తండ్రీ తనయుల కథేమిటో తెలియాలంటే మాత్రం ‘గాలి సంపత్’ సినిమా చూడాల్సిందే. శ్రీవిష్ణు, లవ్లీ సింగ్ జంటగా రూపొందిన చిత్రమిది. రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర పోషించారు. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడంతోపాటు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. అనిల్ మిత్రుడు, రచయిత ఎస్.కృష్ణ షైన్ స్క్రీన్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి శనివారం సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు.
Fa fa faaa Fun-filled entertainer coming your way..:)
My best wishes to the entire team of #GaaliSampath.https://t.co/7Izn59wpUD#DrRajendraPrasad @AnilRavipudi @sreevishnuoffl @YoursSKrishna #Anish @achurajamani @imagesparkent @Shine_Screens— rajamouli ss (@ssrajamouli) February 27, 2021
అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘‘హాస్యం, భావోద్వేగాలతోపాటు, గొప్ప బంధాల మేళవింపుగా రూపొందిన చిత్రమిద’న్నారు. ‘‘గాలి సంపత్ నాకు ప్రత్యేకమైన సినిమా’’ అన్నారు కథానాయకుడు శ్రీవిష్ణు.