వెంకటేష్, వరుణ్‌తేజ్ హీరోలుగా అనిల్‌రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఎఫ్-3’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా, మెహరీన్ కథానాయికలు. శుక్రవారం హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ పునఃప్రారంభమైంది. ఈ మేరకు చిత్రబృందం మేకింగ్ వీడియోను విడుదలచేసింది. ఇందులో వెంకటేష్, వరుణ్‌తేజ్‌లపై ఓ సీన్‌ను చిత్రీకరిస్తూ దర్శకుడు అనిల్‌రావిపూడి కనిపిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ “ఎఫ్-2’కు సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రమిది. డబ్బు వల్ల ఎదురయ్యే సమస్యల్ని ఆవిష్కరిస్తూ రూపొందిస్తున్నాం. మూడింతల వినోదంతో ఆకట్టుకుంటుంది. హైదరాబాద్‌లో ప్రారంభమైన తాజా షెడ్యూల్లో నాయకానాయికలతో పాటు ప్రధాన తారాగణంపై కీలక ఘట్టాలను చిత్రీకరించబోతున్నాం. విలక్షణ మేనరిజం, బాడీలాంగ్వేజ్‌తో వెంకటేష్, వరుణ్‌తేజ్ పాత్రలు అలరిస్తాయి’ అని తెలిపారు. సునీల్, రఘుబాబు, అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్, సహనిర్మాత: హర్షిత్‌రెడ్డి.