మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. దుల్కర్ తాజాగా సెల్యూట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. దుల్కర్ ఖాకీ డ్రెస్‌లో పోలీసాఫీసర్ గా న్యూ లుక్ లో కకనిపిస్తున్నాడు.
బ్యాక్ డ్రాప్ లో కొంతమంది చేతిలో జెండాలతో ఆందళోన నిర్వహిస్తుండగా..దుల్కర్ చేతిలో వాకీటాకీ పట్టుకుని సహద్యోగులను కమ్యూనికేట్ చేస్తున్న పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. సెల్యూట్ కథను నేషనల్ అవార్డు విన్నింగ్ స్క్రిప్ట్ రైటర్ ద్వయం బాబీ-సంజయ్ రాశారు.